Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ముఖచిత్రం'. ఈ సినిమాలో హీరో విశ్వక్ సేన్ ఓ కీలక పాత్రను పోషించారు. 'కలర్ ఫొటో' చిత్ర దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. ఈ చిత్రాన్ని నిర్మాత ఎస్కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల నిర్మించారు. ఈ సినిమాతో గంగాధర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈనెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నాయికలు ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
ప్రియా వడ్లమాని మాట్లాడుతూ, 'నేను ఇప్పటిదాకా ఐదు సినిమాల్లో నటించాను. ఈ చిత్రంలో రెండు విభిన్న పాత్రల్లో నటించాను. అందులో ఒకటి విజయవాడకు చెందిన ఓ చిన్న టౌన్ అమ్మాయి. తను చాలా అమాయకురాలు. సిటీ లైఫ్ ఆమెకు తెలియదు. అలాంటి అమ్మాయి ఒక పేరున్న డాక్టర్‌ను పెళ్లి చేసుకుంటుంది. మరొక క్యారెక్టర్ చాలా రఫ్ అండ్ టఫ్‌గా ఉండే సిటీ అమ్మాయి. ఆమె మాయా ఫెర్నాండేజ్. ఈ చిత్రంలో ఒక మంచి సందేశాన్ని చూపిస్తున్నాం. మన రియల్ లైఫ్‌లో చాలాసార్లు విన్నదే, చూసిందే కానీ ఇప్పటిదాకా తెరపై ఇలాంటి పాయింట్‌ను ఎవరూ తెరకెక్కించలేదు. సందీప్ ఒక కొత్త తరహా సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నారు' అని తెలిపారు.
'ఈ సినిమాలో సిటీ గర్ల్ మాయా ఫెర్నాండేజ్ పాత్రలో నటించాను. లైఫ్‌లో ఎలా ఉండాలనే విషయంలో కంప్లీట్‌గా అవేర్ నెస్ ఉన్న అమ్మాయి. దేనికీ కాంప్రమైజ్ కాకుండా, తను అనుకున్న పని చేస్తుంటుంది. నాకు తెలుగులో తొలి సినిమా. మొదటి చిత్రంలోనే ఓ డిఫరెంట్ రోల్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నాకు, ప్రియా వడ్లమాని కెరీర్‌కి బ్రేక్ ఇచ్చే సినిమా అవుతుందని ఆశిస్తున్నాం' అని మరో నాయిక అయేషా ఖాన్ చెప్పారు.