Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో విశ్వక్ సేన్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న తన తొలి పాన్ ఇండియా సినిమా 'దాస్ కా ధమ్కీ'. డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో విశ్వక్ సేన్ కనిపించిన ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఫుట్-ట్యాపింగ్ నెంబర్‌తో సినిమా మ్యూజిక్ ప్రమోషన్లను ప్రారంభించారు.
'హిందీ వెర్షన్ 'ఆల్మోస్ట్ దిల్ కా పథ మిలా..' పాటని రానా దగ్గుబాటి లాంచ్ చేయగా, తెలుగు వెర్షన్ 'ఆల్మోస్ట్ పడిపోయిందే పిల్లా' పాటను హీరో సిద్ధు జొన్నలగడ్డ రిలీజ్ చేశారు. లియోన్ జేమ్స్ స్కోర్ చేసిన ట్యూన్ చాలా బాగుంది. మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది. పాట కోసం ఫారిన్ లోకేషన్స్‌లో షూట్ చేసిన స్టైలిష్ విజువల్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశ్వక్ సేన్ స్టైలిష్ డ్యాన్స్, నివేదా పేతురాజ్ గ్లామర్ టచ్ థియేటర్స్‌లో ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. లియోన్ జేమ్స్, ఆదిత్య ఆర్కే లైవ్లీగా పాడగా, పూర్ణా చారి సాహిత్యం ఆకట్టుకుంది. హిందీ వెర్షన్‌కి అమితాబ్ వర్మ సాహిత్యం అందించగా, లియోన్ జేమ్స్‌తో కలిసి నకాష్ అజీజ్ ఆలపించారు.
వన్మయే క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లపై కరాటే రాజు నిర్మిస్తున్నఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది' అని చిత్ర బృందం తెలిపింది.