Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇద్దరు అమ్మాయిలు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందనే కాన్సెప్ట్‌తో 'డేంజరస్' (మా ఇష్టం) సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కించా అని దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. నైనా గంగూలీ, అప్సర రాణి ప్రధాన పాత్రలలో కంపెనీ పతాకంపై ఆయన రూపొందించిన ఈ సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, 'రెగ్యులర్ కమర్షియల్ అంశాలు ఇందులో ఉంటాయి. చాలా దేశాలతోపాటు మనదేశంలోనూ లెస్బియిజంపై అవగాహన తీసుకొచ్చారు. అయితే నేను లెస్బియిజాన్ని సపోర్ట్ చేస్తూ తీసిన చిత్రం కాదు. ఇద్దరు అమ్మాయిలు ముద్దు పెట్టుకుంటే చూడాలని చాలా మంది మగవాళ్లలో ఉంటుందని ఓ సర్వేలో చదివాను. ఈ సినిమాలోని తమ పాత్రలను ఇద్దరు హీరోయిన్లు ఎంతో ధైర్యంగా చేశారు. వాస్తవానికి ఇలాంటి పాత్రలు అందరూ చేయలేరు. వారిద్దరు తమ పాత్రలలో గ్లామర్‌తో పాటు మంచి నటన కనబరిచారు. ఇద్దరు అమ్మాయిలతో ఒక డ్యూయెట్ సాంగ్‌ను పెట్టడంలో ప్రపంచంలోనే మొదటిసారి. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమాను తెలుగులో నట్టి కుమార్ విడుదల చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయాలు రసవత్తర డ్రామాతో సాగుతున్నాయి. దీనిని ఆధారంగా చేసుకుని వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత నుంచి చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సాగుతున్న పరిస్థితులను ఎలా తమకు అనుకూలంగా మలచుకున్నారన్న అంశాలతో 'వ్యూహం' సినిమాను తీయబోతున్నా. దీనికి పార్ట్2గా 'శపథం' సినిమా చేస్తాను. అలాగే ఉపేంద్రతో ఓ సినిమా, బిగ్ బి అమితాబచ్చన్‌తో ఒక సినిమా చేయబోతున్నాను' అని చెప్పారు.