Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, రవితేజ, దర్శకుడు బాబీ కొల్లి (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్లో రూపొందిన సినిమా 'వాల్తేరు వీరయ్య'. సంక్రాంతి కానుకగా ఈనెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఘన విజయం సాధించింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ 'వీరయ్య విజయ విహారం' పేరుతో సక్సెస్ సెలబ్రేషన్స్‌ని హన్మకొండలో గ్రాండ్‌గా నిర్వహించారు. రామ్ చరణ్ ఈ వేడుకలో ప్రత్యేక అతిధిగా పాల్గొన్నారు. భారీ ఎత్తున ప్రేక్షకులు, అభిమానులు హాజరైన ఈ వేడుక వైభవంగా జరిగింది. ఈ వేడుకలో చిరంజీవి చేతుల మీదుగా చిత్ర యూనిట్‌కు షీల్డ్స్ ప్రధాన కార్యక్రమం గ్రాండ్‌గా జరిగింది.
చిరంజీవి మాట్లాడుతూ,'ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకున్నాం. కానీ నాన్ బాహుబలి, నాన్ ఆర్ఆర్ఆర్ స్థాయి సినిమా అవుతుందని మేము ఊహించలేదు. ఇంత గొప్ప విజయానికి అగ్ర తాంబూలం ఇవ్వాల్సింది ప్రేక్షకులకే. ఈ సినిమా 250 కోట్ల గ్రాస్‌కి చేరబోతుందంటే అది ఆషామాషీ విషయం కాదు. ప్రేక్షకులు నన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా మళ్ళీ తెరపై చూస్తూ ఒక ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ ఇలాంటి సినిమాలని గుర్తు చేసుకోవడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇలాంటి ఫీలింగ్ మీకు, నాకు కలిగించడానికి ప్రధాన కారణం దర్శకుడు బాబీ. రవితేజని చూస్తే నాకు మరో పవన్ కళ్యాణ్గా అనిపిస్తాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు నిజమైన నిర్వచనంగా నిలబడ్డారు' అని తెలిపారు. 'ఈ సినిమా పెద్ద బ్లాక్‌బస్టర్ అవుతుందని చిరంజీవి అన్నయ్య జడ్జ్ మెంట్‌తో ముందే నమ్మకం వచ్చింది. మా చిరంజీవిని మాకు ఇచ్చావు అనే మాట అన్నయ్య అభిమానుల నుండి వింటూనే వున్నాను. వీరయ్య ఎంతో గౌరవాన్ని తెచ్చిపెట్టింది' అని దర్శకుడు బాబీ కొల్లి చెప్పారు.
నిర్మాత నవీన్ యెర్నేని మాట్లాడుతూ,'ఈసినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అంటే .. ఈ రోజుల్లో సినిమా డిస్ట్రిబ్యుటర్స్కి బ్రేక్ ఈవెన్ అయితే హిట్ అంటున్నారు. 20 శాతం కమీషన్ వస్తే బ్లాక్ బస్టర్ అంటున్నారు. 20 శాతంకంటే ఓవర్ ఫ్లో వస్తే దీనిని ఏమనాలి ?! ఆల్ టైం ఇండిస్టీ హిట్ అనాలి. ఈనెల 13 నుండి వాల్తేరు వీరయ్య సర్ప్రైజ్ రిజల్ట్ ఇస్తూనే ఉంది. మా అంచనాలకు మించి కలెక్ట్ చేస్తోంది. నా కెరీర్ ఇలాంటి రిజల్ట్ ఎప్పుడూ చూడలేదు' అని అన్నారు.
బ్లాక్ బస్టర్ నిర్మాతలు నవీన్, రవికి అభినందనలు. నాకు 'రంగస్థలం' లాంటి మైల్ స్టోన్ మూవీ ఇచ్చారు. నాకే కాదు వారితో పని చేసిన ప్రతి హీరోకి బ్లాక్ బస్టర్ ఇచ్చే నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్. బాబీకి బిగ్ కంగ్రాట్స్. చిరంజీవి గారు మా నాన్న గారిలా లేరు.. మా బ్రదర్‌లా ఉన్నారు. నేను ఇక్కడికి ఒక అభిమానిగా వచ్చాను. ఈ సినిమా చూసి ఎంత ఎంజాయ్ చేశానో మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను.
- రామ్‌చరణ్