Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న చిత్రం 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం'.
వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్ పై జైదీప్ విష్ణు దర్శకత్వం వహిస్తుండగా, సంతోష్ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేశారు. ఈ చిత్రం ఫిబ్రవరి 3న రాబోతోంది.
ఈ నేపథ్యంలో ఆదివారం చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ, 'ఈ సినిమా జనాలకు నచ్చుతుందని, వారికి రీచ్ అవుతుందని అనుకుంటున్నాను. మా ఊరోడు సినిమా తీస్తున్నాడని, మాకు ఊరు ఊరంతా సాయం చేసింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎంతో సహకారం అందించింది. కాసర్ల శ్యామ్ లేకపోతే మాకు మణిశర్మ దొరికేవారు కాదు' అని తెలిపారు. 'ఈ సినిమా అంతా అయిపోయిన తరువాత నాకు ఒక విషయం అర్థమైంది. దర్శకుడు కనిపించినంత సాఫ్ట్ ఏం కాదు. మేం అంతా కలిసి కొత్తగా ట్రై చేశాం. ఆడియెన్స్ సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని సంగీత దర్శకుడు మణిశర్మ అన్నారు.
ప్రవీణ్ కండేలా మాట్లాడుతూ, 'ఈ చిత్రంలో రాజన్న పాత్రను పోషించాను. మేం ఇంతకు ముందు 'చోర్ బజార్' అనే షార్ట్ ఫిల్మ్ చేశాం. ఆ తరువాత ఇండిపెండెంట్ సినిమా చేద్దాం అనుకున్నాం. అది చివరకు పెద్ద సినిమాగా మారింది. విలన్‌గా చేశానా? లీడ్‌గా చేశానా? అన్నది సినిమా చూశాకే అర్థం అవుతుంది' అని తెలిపారు. 'నాకు అవకాశం ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్స్. ఈ సినిమాను పూర్తిగా అటవీ ప్రాంతంలో షూట్ చేశాం' అని శ్రీకాంత్ రాథోడ్ అన్నారు.
కాసర్ల శ్యామ్ మాట్లాడుతూ, 'అనుకున్నది చేసే వరకు పట్టుబట్టే ఈ టీం.. తమను తాము చూసుకునే 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం' అని టైలిల్‌ను పెట్టుకున్నట్టున్నారు. మణిశర్మ సినిమాను ఒప్పుకోవడంతో వీరి మొదటి కల నెరవేరినట్టు అయింది. ఇందులో మూడు పాటలు రాశాను. ఈ సినిమాను పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను' అని చెప్పారు.