Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వరల్డ్ ఫిల్మ్ ఇండిస్టీలోనే తొలి ప్రయత్నంగా సింగిల్ షాట్లో సింగిల్ క్యారెక్టర్‌తో హన్సిక ప్రధాన, ఒకే పాత్ర పోషించిన చిత్రం '105 మినిట్స్'. రాజు దుస్సా రచన, దర్శకత్వంలో ఎడ్జ్ ఆఫ్ ద సీట్ థ్రిల్లర్‌గా రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ పతాకం పై బొమ్మక్ శివ నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఫస్ట్ కాపీ రెడీ అయిన ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రానుంది. అతి త్వరలో ట్రైలర్ విడుదల కానుంది.
'1.45 నిమిషాల పాటు ఉత్కంఠతరేపే కథను సింగిల్ షాట్లో అంతే ఎంగేజింగ్‌గా తెరకెక్కించడం సాహసమే. హాలీవుడ్లో సింగిల్ షాట్ టెక్నిక్‌లో తెరకెక్కిన 'బర్డ్ మన్, 1917' చిత్రాల తరహాలో ఈ చిత్రం రూపొందించబడింది. రీల్ టైం, రియల్ టైం ఒకేలా ఉండి మనం ఆ సన్నివేశంలో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతాం. డైలాగులు కూడా చాలా తక్కువగా, పరిమితమై గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే తోనే సినిమా జరుగుతుంది. ఇది డైరెక్టర్ విజన్‌కు, డిఓపి ప్రతిభకు తార్కాణం. ఈ చిత్రానికి స్టంట్ మాస్టర్ : మల్లి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, స్క్రిప్ట్ చీఫ్ అసోసియేట్ : రూప కిరణ్ గంజి, ఎడిటర్ : శ్యామ్ వడవల్లి, ప్రొడక్షన్ డిజైనర్ : బ్రహ్మ కడలి, డి ఓ పి : కిషోర్ బోయిదాపు, మ్యూజిక్ : సామ్ సి ఎస్, కో ప్రొడ్యూసర్ : బొమ్మక్ యషిత.