Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యూనివర్సల్ అప్పీల్‌తో రూపొందిన నాని నయా చిత్రం 'దసరా'. ఈ చిత్ర టీజర్‌ను దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి లాంచ్ చేశారు.
చెడుపై మంచి సాధించిన విజయాన్ని చూపించే సినిమా 'దసరా'. టీజర్‌ను బట్టి చూస్తే కంటెంట్ ఒరిజినల్, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టు కుంటుందని చెప్పకనే చెబుతోంది.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో నాని మాట్లాడుతూ,''దసరా' నాకు చాలా స్పెషల్ మూవీ. మార్చి 30న అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. తెలుగు సినిమా గురించి నా కాంట్రిబ్యూషన్ ఏమిటని చాలా సార్లు ఆలోచించే వాడిని. చాలా గర్వంగా ఒక మాట చెబుతున్నాను. తెలుగు, ఇండియన్ సినిమాకి ఈ ఏడాది నా తరపున నుండి బిగ్గెస్ట్ ట్రిబ్యూషన్. శ్రీకాంత్ ఓదెల అది ఎందుకో, ఎలాంటి సినిమా తీశాడో మార్చి 30న తెలుస్తుంది. టీజర్ జస్ట్ శాంపిల్ మాత్రమే. సినిమా అదిరిపోతుంది.. నెక్స్ట్ లెవల్‌లో ఉంటుంది. గత ఏడాది తెలుగు నుంచి ఆర్‌ఆర్‌ఆర్, కన్నడ నుండి కేజీఎఫ్ వచ్చింది. చాలా నమ్మకంగా, గర్వంగా చెబుతున్నా ఈ ఏడాది 'దసరా' వస్తోంది' అని తెలిపారు. 'ఈ సినిమా ఒక పెద్ద పండగలా ఉంటుంది. నాని నుంచి ఇలాంటి సినిమాని గతంలో ఎప్పుడూ చూసి ఉండరు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది. ఈ చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఏకకాలంలో విడుదల చేస్తున్నాం' అని నిర్మాత శ్రీకాంత్ చెప్పారు. 'ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నందుకు ఆనందంగా ఉంది' అని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల అన్నారు.