Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్ రామ్ త్రిపాత్రిభినయంలో నటించిన చిత్రం 'అమిగోస్'. రాజేంద్ర రెడ్డి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన 'అమిగోస్' మూవీ టీజర్, సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మంగళవారం ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'ధర్మ క్షేత్రం' సినిమాలో ఎవర్ గ్రీన్ మెలోడి సాంగ్ 'ఎన్నో రాత్రులొస్తాయిగానీ..' సాంగ్‌కి ఇది రీమిక్స్. 'ధర్మ క్షేత్రం'లో ఈ పాటను ఎస్.పి.బాలసుబ్రమణ్యం పాడారు. యాదృచ్చికంగా ఇప్పుడు అదే పాటకు రీమిక్స్ సాంగ్‌ను ఆయన తనయుడు ఎస్.పి.బి.చరణ్ ఆలపించారు. ఈ క్లాసిక్ సాంగ్‌ను ఎస్.పి.బి.చరణ్‌తో పాటు సమీర భరద్వాజ్ పాడారు. ఇళయ రాజా అందించిన ఈ ట్రాన్సింగ్ ట్యూన్ మనల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళ్ళడం ఖాయం.
ఈ వీడియో సాంగ్ కళ్యాణ్ రామ్, ఆషికా రంగనాథ్ మధ్య సాగే బ్యూటీఫుల్ రొమాన్స్‌ను చక్కగా ఎలివేట్ చేస్తుంది. చక్కటి ట్యూన్‌కి తగ్గ సాహిత్యం, విజువల్స్ ఆడియెన్స్ కళ్లకు ట్రీట్‌లాగా ఉంది. శాండిల్ వుడ్ బ్యూటీ ఆషికా రంగనాథ్ ఈ మెలోడి మ్యూజిక్‌లో మరింత అందంగా కనిపిస్తుంటే.. కళ్యాణ్ రామ్ స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకున్నారు. బెస్ట్ సాంగ్స్ ప్లే లిస్ట్‌లో ఈ రీమిక్స్ సాంగ్ స్థానం దక్కించుకుంటుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు అని చిత్ర బృందం దీమా వ్యక్తం చేసింది.
జిబ్రాన్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 10న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు.