Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఊహకు అందని కాన్సెప్ట్
ప్రముఖ నేపథ్య గాయని చిత్ర పాడిన 'శ్రీ రాముడా, కృష్ణుడా, ఈశ్వరు డా..' అనే పాట రికార్డింగ్‌తో యం.యన్.ఆర్. ఆర్ట్స్ బ్యానర్ పై ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైన నూతన చిత్రం
'ఊహకు అందనిది'.
ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో హై గ్రాఫిక్స్‌తో పాటు అత్యంత హై టెక్నికల్ వ్యాల్యూస్‌తో నిర్మించబోతున్నారు. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో వస్తున్న మూవీ అనేది అందరికీ అర్థమవుతుంది. ఇప్పటివరకు వచ్చిన 'అమ్మోరు, అరుంధతి' వంటి అత్యంత భారీ బడ్జెట్ సినిమాలకూ ఏ మాత్రం తీసిపోని విధంగా తీయడానికి సిద్ధపడుతున్నారు నిర్మాతలు. హైదరాబాద్‌తో పాటు చెన్నైలోనూ భారీ ఎత్తున సెట్టింగ్స్ వేసి షూటింగ్ జరపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఏప్రిల్‌లో షూటింగ్ మొదలు పెట్టి డిసెంబర్లో చిత్రాన్ని పూర్తి చేసి, జనవరిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : మహావీర్, లిరిక్స్ : యం.యన్.ఆర్. రచన-దర్శకత్వం : యం.నాగేంద్ర (యం.యన్.ఆర్).