Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పార్వతీశం, జశ్విక జంటగా శ్రీబాలాజీ పిక్చర్స్ బ్యానర్‌పై వైభవ్ దర్శకత్వంలో వర్షా ముందాడ, మాధవి నిర్మిస్తున్న న్యూ ఏజ్ ప్లాటోనిక్ లవ్ స్టోరీ 'తెలుసా..మనసా..'. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే చిత్రమిది. ఓ గ్రామంలో బెలూన్స్ అమ్ముకునే యువకుడు (పార్వతీశం), అదే ఊర్లో పని చేసే హెల్త్ అసిస్టెంట్ సుజాత (జశ్విక)ను ప్రేమిస్తాడు. ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది. కానీ ఎప్పుడూ వారిద్దరూ ఆ ప్రేమను వ్యక్తం చేసుకోరు. మల్లి బాబు పలు సందర్భాల్లో తన ప్రేమను సుజాతతో చెప్పటానికి ప్రయత్నిస్తాడు. కానీ చెప్పలేకపోతాడు. అయితే ఉన్నట్లుండి మల్లి బాబు కలలు కూలిపోతాయి. సుజాతకు దూరం కావాల్సి వస్తుంది. మరి వారిద్దరూ కలుసుకున్నారా! అనేదే ఈ సినిమా. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
బుధవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను నిర్మాత దిల్ రాజు విడుదల చేసి, చిత్ర యూనిట్‌కి అభినందనలు తెలిపారు. డెబ్యూ డైరెక్టర్ వైభవ్ ఈ చిత్రాన్ని న్యూ ఏజ్ లవ్ స్టోరిగా తెరకెక్కిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ సంగీత సారథ్యం వహిస్తున్నారు. ప్రసాద్ ఈదర సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి పాపారావ్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: నైనీష్య, సాత్విక్, కో ప్రొడ్యూసర్: గిరిధర్.