Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సితార ఎంటర్టైన్మెంట్స్ నుంచి వస్తున్న మరో ఆసక్తికరమైన చిత్రం 'బుట్ట బొమ్మ'. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ ఫీల్ గుడ్ రూరల్ డ్రామాకి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రంతో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం ఈనెల 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మీడియాతో మాట్లాడుతూ, 'సినిమాలపై ప్యాషన్‌తో రామ్ గోపాల్ వర్మకి చెందిన వర్మ కార్పొరేషన్లో పనిచేశాను. తర్వాత సుకుమార్ దగ్గర 'జగడం' నుంచి 'పుష్ప' సినిమా వరకు పని చేశాను. 'కప్పేల' చిత్రాన్ని చూశాను. కథనం పరంగా చాలా నచ్చింది. ఇది పూర్తిగా స్క్రిప్ట్ మీద ఆధారపడిన సినిమా. మెయిన్ పాయింట్‌ని తీసుకొని మన తెలుగు నేటివిటీకి తగ్గట్లు చాలా మార్పులు చేశాం. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలు ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. ఈ సినిమాలో సంగీతానికి చాలా ప్రాధాన్యముంది. గోపీసుందర్ ఒక పాట, నేపథ్య సంగీతం అందించారు. స్వీకర్ అగస్తి రెండు పాటలు స్వరపరిచారు. ఈ సినిమా చూసి నిర్మాత చినబాబు, త్రివిక్రమ్ బాగుందని ప్రశంసించారు. వీళ్ళ మాదిరిగానే ప్రేక్షకులను సైతం అలరించి విజయం సాధిస్తుంది' అని తెలిపారు.