Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత 8 ఏళ్ళుగా ఇండిస్టీలో పలు సెగ్మెంట్స్‌లో వర్క్ చేస్తూ రామ్‌గోపాల్‌వర్మ దగ్గర దర్శకత్వశాఖలో మెళకువలు నేర్చుకుని, అడవి శేష్ 'క్షణం' సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా, 'గూఢచారి, టైగర్నాగేశ్వరావు' వంటి సినిమాలకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా, 'నేను లేని నా ప్రేమకథ' సినిమాలో లీడ్ రోల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు క్రిష్ సిద్ది పల్లి. ప్రస్తుతం మూడు ప్రాజెక్ట్స్‌లో నటిస్తున్న క్రిష్ సిద్ది పల్లి పుట్టినరోజు నేడు (శుక్రవారం).
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, '2014లో 'క్షణం'కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా వర్క్ చేశాను. ఇది నా లైఫ్‌కు ఒక టర్నింగ్ పాయింట్ . నా వర్కింగ్ స్టైల్ నచ్చి 'గూఢచారి' సినిమాకు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా అవకాశం ఇచ్చారు. అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో కూడా కొన్ని సినిమాలకి, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌లో 'టైగర్ నాగేశ్వరరావు' సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా చేశాను. నటనలో భాగంగా 'నేను లేని నా ప్రేమకథ'లో నవీన్ చంద్ర , నేను మెయిన్ లీడ్స్‌గా చేశాం. ఈ సినిమా నాకు మంచి పేరు తీసుకువచ్చింది. ప్రస్తుతం సుఖీభవ అనే ప్రాజెక్ట్‌లో ఒక విలేజ్ బాయ్ రోల్ ప్లే చేశాను. సెకండ్ ప్రాజెక్ట్ 'రమ్య, రాబర్ట్, రహీం' సినిమాలో బ్లైండ్ క్యారెక్టర్ చేస్తున్నాను. 'ఎంగేజ్మెంట్' అనే సినిమా నాలుగు లాంగ్వేజ్‌లో జరుగుతోంది. ఇది డిఫరెంట్ లవ్‌స్టోరీ. ఇవి కాకుండా 'లవ్ ఇన్ 65'లో యంగ్ రాజేంద్ర ప్రసాద్ రోల్ చేశాను. ఆహాకీ లావణ్య త్రిపాఠి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను. ఇలా మెయిన్ లీడ్స్‌లోనే కాకుండా డిఫరెంట్ రోల్స్‌లో కూడా నటిస్తున్నాను' అని అన్నారు.