Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కొత్తగా మా ప్రయాణం' ఫేమ్ ఈశ్వర్ హీరోగా, నైనా సర్వర్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం 'సూర్యాపేట జంక్షన్'.
'కథనం' ఫేమ్ నాదెండ్ల రాజేష్ దర్శకత్వంలో యోగా లక్ష్మి ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.ఎస్‌రావు, విష్ణువర్ధన్ సంయుక్తంగా నిర్మిస్తున్న యూత్‌ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఇది.
ఈ చిత్ర టీజర్‌ని హీరో ఈశ్వర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చూసిన మీడియా మిత్రులు, మా ఫ్రెండ్స్ చాలా బాగుంది అంటుంటే మా కష్టానికి ఊపిరి పోసినట్లు అనిపించింది. నా కథని నమ్మి రాజేష్ నాతో రెండున్నర సంవత్సరాలు జర్నీ చేశారు. ఈ అవుట్‌పుట్ రావడానికి కారణమైన మా డైరెక్టర్‌కి, మా టీమ్‌కి నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఈమూవీని ఒక యదార్థ కథతో సినిమాటిక్‌గా మలుచుకుని చేశాం. హీరోయిన్ నైన సర్వల్ బాగా సపోర్ట్ చేసింది. ఇందులో నటించిన ప్రతి ఒక్కరూ వాళ్ళ పాత్రల్లో బాగా చేశారు. నటీనటులు, టెక్నీషియన్ల సమష్టి కృషితో సినిమా చాలా బాగా వచ్చింది' అని తెలిపారు.
'తెలుగులో ఈ అవకాశం ఇచ్చిన మా రాజేష్‌కి, ఈశ్వర్‌కి చాలా థ్యాంక్స్. ఈ సినిమా టీజర్ చాలా నచ్చింది. ఇప్పుడు నాకు ఈ సినిమా మంచి సక్సెస్ అవుతుంది అని నమ్మకంగా ఉంది' అని హీరోయిన్ నైన సర్వార్ చెప్పారు.
దర్శకుడు రాజేష్ మాట్లాడుతూ,'టీజర్ చాలా బాగుంది అని అంటుంటే హ్యాపీగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా ఈశ్వర్‌కి కృతజ్ఞతలు మిగతా విషయలు ట్రైలర్ లాంచ్‌లో మాట్లాడతాను' అని అన్నారు. 'సినిమా బాగా వచ్చిందని మీకు టీజర్ చూస్తే అర్దం అయ్యే ఉంటుంది. ఈ సినిమా కోసం అందరూ చాలా కష్టపడ్డారు. ఈ చిత్రం చాలా మంచి సక్సెస్ అవుతుంది అని నమ్ముతున్నాను' అని ప్రొడ్యూసర్ నల్లపల్లి శ్రీనివాస్ తెలిపారు.
అభిమన్యు సింగ్, లక్ష్మణ్, భాషా, సూర్య,హరీష్, చలాకీ చంటి,మున్న వేణు, చమ్మక్ చంద్ర, కోటేశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి నిర్మాతలు : అనిల్ కుమార్ కాట్రగడ్డ, ఎన్.శ్రీనివాసరావు, విష్ణువర్ధన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : పాండు అలిజాల, డైరెక్టర్ : యన్.రాజేష్, స్టోరీ : ఈశ్వర్, మ్యూజిక్ : రోషన్ సాలూరి, గౌర హరి, డి.ఓ.పి : అరుణ్ ప్రసాద్,
ఎడిటర్ : ఎం.ఆర్.వర్మ, లిరిక్స్ : ఎ.రెహ్మాన్, రైటర్స్ : సత్య, రాజేంద్ర భరద్వాజ్.