Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఆసక్తికరమైన చిత్రం 'బుట్ట బొమ్మ'. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ భాగస్వామ్యంతో రూపొందిన ఈ చిత్రానికి సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మాతలు. అనిఖా సురేంద్రన్, సూర్య వశిష్ఠ, అర్జున్ దాస్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్తో శౌరి చంద్రశేఖర్ రమేష్ దర్శకుడిగా పరిచయం అయ్యారు. శనివారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు శౌరి చంద్రశేఖర్ రమేష్ మాట్లాడుతూ, 'సినిమా బాగుందని యూఎస్ నుంచి కూడా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ కూడా మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ వస్తోంది. ఇది లవ్ స్టోరీ నుంచి థ్రిల్లర్ గామారే కథ అయినప్పటికీ.. ఇది కుటుంబమంతా కలిసి చూడదగ్గ సినిమా' అని తెలిపారు. 'ప్రేక్షకుల నుంచి, మీడియా నుంచి వస్తున్న స్పందన పట్ల చాలా సంతోషంగా ఉన్నాం' అని నటుడు అర్జున్ దాస్ అన్నారు. మరో నటుడు సూర్య వశిష్ఠ మాట్లాడుతూ, 'మేము ప్రేక్షకులతో కలిసి సినిమా చూశాం. ప్రేక్షకుల నుంచి చాలా మంచి స్పందన వచ్చింది. సినిమా మీద మేం పెట్టుకున్న నమ్మకం నిజమైనందుకు చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు.
'మేం ఎంతో ఇష్టపడి చేసిన మా సినిమాకు ఇంతమంచి స్పందన రావడం చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు' అని నటి అనిఖా సురేంద్రన్ తెలిపారు.