Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'ఏజెంట్' థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా మేకర్స్ మేకింగ్ వీడియోను విడుదల చేసి 'ఏజెంట్'ని వేసవిలో విడుదల చేస్తున్నట్లు చెప్పారు. తాజా అప్డేట్ ప్రకారం ఈ చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమా హాలిడే సీజన్లో క్యాష్ చేసుకోబోతోంది. అలాగే పాన్ ఇండియా రిలీజ్ కోసం సమ్మర్ బెస్ట్ సీజన్. వైల్డ్ యాక్షన్ గ్లింప్స్ ద్వారా మేకర్స్ విడుదల తేదీని ప్రకటించారు. అఖిల్‌ని కుర్చీకి కట్టేసి, తలకు మాస్క్ కప్పారు. అతను పని చేస్తున్న ఏజెన్సీ గురించి అడిగినప్పుడు, ''ఒసామా బిన్ లాడెన్, గడాఫీ, హిట్లర్'' అని సమాధానమిచ్చాడు. ముఖం అంతా రక్తంతో నిండి.. తనని తాను వైల్డ్ సాలే పిలవడం క్యూరియాసిటీ పెంచింది.
విడుదల తేదీ గ్లింప్స్ చాలా వైల్డ్‌గా ఉంది . అఖిల్ పాత్ర వైల్డ్ సైడ్‌ను ప్రజెంట్ చేసింది. అఖిల్ ఈ చిత్రంలో పొడవాటి, గిరజాల జుట్టుతో విభిన్నమైన గెటప్స్‌లో కనిపించనున్నారు. ఈ సినిమా కోసం స్టైలిష్ మేక్ఓవర్ అయ్యారు. సిక్స్ ప్యాక్ అబ్స్‌తో కనిపిస్తాడు. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని ఇతర స్పై థ్రిల్లర్లకు పూర్తి భిన్నంగా రూపొందించారు. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా నటిస్తోంది. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా, అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. అజరు సుంకర, దీపా రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానుంది. ఈ చిత్రానికి దర్శకుడు: సురేందర్ రెడ్డి, నిర్మాత: రామబ్రహ్మం సుంకర, సహ నిర్మాతలు: అజరు సుంకర, దీపా రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, కథ: వక్కంతం వంశీ, సంగీతం: హిప్ హాప్, డీవోపీ: రసూల్ ఎల్లోర్.