Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వ కార్తికేయ, శరణ్, అవంతిక, అర్చన గౌతమ్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'ఐపీఎల్'. బీరం వరలక్ష్మి సమర్పణలో అంకిత మీడియా హౌస్ బ్యానర్ పై సురేష్ లంకలపల్లి దర్శకత్వం వహించగా, బీరం శ్రీనివాస్ నిర్మించారు. ఈ సినిమా ఈనెల 10న రిలీజ్ అవుతున్న నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ప్రసాద్ ల్యాబ్స్ గార్డెన్స్‌లో చిత్ర బృందం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా నిర్మాత బీరం శ్రీనివాస్ మాట్లాడుతూ, 'మా సినిమాలో నటించిన నటీనటులు, టెక్నీషియన్స్ సహకారంతో సినిమా బాగా వచ్చింది. ఈనెల 10న మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం' అని తెలిపారు.'ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని రిలీజ్‌కి వచ్చాం. మాకు నిర్మాత డిఎస్రావు మొదట్నుంచీ మంచి సపోర్ట్ చేశారు. అందరి సహకారంతో సినిమా అవుట్‌ఫుట్ చాలా బాగా వచ్చింది. సినిమా ఫలితంపై అందరం ఎంతో నమ్మకంగా ఉన్నాం' అని దర్శకుడు సురేష్ లంకలపల్లి అన్నారు. హీరో నితిన్ నాష్ మాట్లాడుతూ,'క్రికెట్లో ఉండే ఒక మంచి టీమ్ మాదిరిగానే మా టీమ్ కూడా. అందరూ సొంత సినిమాలా భావించి చేశారు' అని చెప్పారు. 'ఒక మూవీ పూర్తి చేయడం ఒక టాస్క్ అయితే దాన్ని 200 థియేటర్స్‌లో రిలీజ్ చేయటం మామూలు విషయం కాదు. ఈ సినిమాలోని పాటలు ఇప్పటికే పెద్ద హిట్ కావడానికి కారణం మ్యూజిక్ డైరెక్టర్ వేంగి. క్రికెట్, తీవ్రవాదాన్ని మిక్స్ చేసి దర్శకుడు సురేష్ బాగా తెరకెక్కించారు' అని మరో హీరో విశ్వ కార్తికేయ అన్నారు. హీరోయిన్ అవంతిక మాట్లాడుతూ, 'ఇలాంటి ఓ మంచి సినిమాలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా విజయంతో నాకు మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను' అని తెలిపారు.