Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సిఎమ్‌బి ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎం. మోహన శివకుమార్ సమర్పణలో సి.సుబ్రహ్మణ్యం నిర్మించిన చిత్రం 'హెబ్బులి'. ఎస్.కృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కిచ్చసుదీప్, అమలాపాల్ నటించిన ఈ చిత్రం కన్నడలో విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే బాక్సాఫీసు వద్ద కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయం సాధించింది.
ప్రస్తుతం ఈ చిత్రం తెలుగులో డబ్బింగ్, సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియోని నిర్మాతలు ఫిలిమ్ ఛాంబర్లో ఘనంగా విడుల చేశారు. చిత్ర ట్రైలర్‌ను నిర్మాత సి.కళ్యాణ్ లాంచ్ చేయగా, మొదటి పాటను ప్రసన్న కుమార్ రిలీజ్ చేశారు. అలాగే మరో నిర్మాత తుమ్మలపల్లి సత్యనారాయణ రెండవ పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియాతో నిర్మాత సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ,'కన్నడలో ఈ సినిమా సూపర్ కలెక్షన్లు సాధించింది. దీంతో నేను మంచి ఫ్యాన్సీ రేటు ఇచ్చి కొన్నాను' అని తెలిపారు. 'ఈ సినిమా 'విక్రాంత్ రోణా' కంటే పెద్ద హిట్ కావాలి. ఈనెల 25న రెండు రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాం' అని పంపిణీదారుడు బాపిరాజు అన్నారు. వి.రవిచంద్రన్, పి. రవిశంకర్, కబీర్ దుహన్ సింగ్, రవి కిషన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో శంకర్, రవి కిషన్, సంపత్ రాజ్ నెగిటివ్ రోల్స్‌లో కనిపిస్తారు. ఎ.కరుణాకర్ సినిమాటోగ్రఫీ అందించగా, సౌండ్‌ట్రాక్, ఫిల్మ్ స్కోర్‌ను అర్జున్ జన్య స్వరపరిచారు.