Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవీంద్ర గోపాల హీరోగా, ఆయన దర్శకత్వంలోనే రూపొందిన చిత్రం 'దేశం కోసం'. ఈ సినిమా నెల 10న విడుదలకి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో రవీంద్రగోపాల ఏకంగా 14 మంది స్వాతంత్య్ర సమర యోధుల పాత్రలు పోషించారు. ఫిలిం ఛాంబర్లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో హీరో, దర్శకుడు రవీంద్రగోపాల్ మాట్లాడుతూ,'ఇప్పుడున్న జనరేషన్‌కి ఆజాద్ చంద్రశేఖర్‌గా మా బాబుని ఈ చిత్రంలో పరిచయం చేశాను. ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూసి ఉంటారు. కానీ ఈ చిత్రం చూసి చెప్పండి ఎలా ఉంది అనేది. నా సినిమా నాకు బాగానే ఉంటుంది. కానీ మీరందరూ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను' అని అన్నారు. ఈ చిత్రం మంచి హిట్ అవ్వాలని డిస్ట్రిబ్యూటర్ శంకర్ కోరారు. ముఖ్య అతిధిగా విచ్చేసిన నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బావుంది. ఈ టైటిల్ మా గురువు దాసరి కోసం నేను రిజిస్టర్ చేయించిన టైటిల్. కానీ మన రవీంద్ర ఈ టైటిల్ కావాలని అడిగితే, ఇచ్చేశాను' అని చెప్పారు.