Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కవలలు హీరోలుగా ఓ కొత్త సినిమా రాబోతోంది. టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ ప్రారంభోత్సవం సందర్భంగా తిరుపతి శ్రీనివాసరావు నిర్మాణంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రానికి శ్రీకారం చుట్టారు.
నిజ జీవితంలోని కవలలు రామకృష్ణ, హరికృష్ణ హీరోలుగా నటిస్తున్న చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు మాట్లాడుతూ,'టాలీవుడ్లో మాకంటూ ఓ స్థానం ఏర్పచుకునేందుకు ఈ సంస్థను ప్రారంభించాం. మా పిల్లలు రామకృష్ణ, హరికృష్ణ ఇద్దరినీ ఈ సినిమా ద్వారా ఇండిస్టీకి పరిచయం చేస్తున్నాం. ఆదరించాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా కోసం మాస్టర్ మాన్ బద్రీ సపోర్ట్ ఎంతో ఉంది' అని తెలిపారు. ముఖ్య అతిథి స్టంట్ మాన్ బద్రీ మాట్లాడుతూ, 'నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు కొడుకులు నటులుగా ఇండిస్టీలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలి' అని అన్నారు. 'ఈ సినిమా ద్వారా మేం హీరోలుగా పరిచయం అవుతున్నాం. చిన్నప్పట్నుంచి నటులం కావాలనే డ్రీమ్ ఉండేది. అది ఇప్పుడు నెరవేరుతోంది. ప్రేక్షకులను మెప్పించేలా మేం నటిస్తాం' అని హీరోలు రామకృష్ణ, హరికృష్ణ చెప్పారు. ఈ కార్యక్రమానికి హాజరైన అతిథులకు టిఎస్ఆర్ మూవీ మేకర్స్ సంస్థకు సంబంధించిన మెమోంటోలు అందజేసి సత్కరించారు.