Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుహాస్ నటించిన తాజా చిత్రం 'రైటర్ పద్మభూషణ్'. నూతన దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టీనా శిల్పరాజ్ కథానాయిక. ఛారు బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్ బ్యానర్స్ పై అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, చంద్రు మనోహర్ నిర్మించిన ఈ చిత్రాన్ని జి.మనోహర్ సమర్పించారు. ఈనెల 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. తాజాగా చిత్ర యూనిట్ 'ది స్వీట్ సర్ప్రైజ్ రివీల్' అనే కాన్సెప్ట్‌తో ప్రెస్‌మీట్‌ని నిర్వహించింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన యాంకర్ సుమ మాట్లాడుతూ,'ఇంత మంచి కథని తీసుకొచ్చిన శరత్, అనురాగ్, చంద్రుకి, దర్శకుడు ప్రశాంత్‌కి అభినందనలు. సినిమా చాలా బావుంది. దర్శకుడు ప్రశాంత్‌కి అభినందనలు. నేడు (బుధవారం) ఈ సినిమాని మహిళల కోసమని ఒక గిఫ్ట్‌లా ఉచితంగా చూపించబోతున్నారు. ఎవరి కోసం సినిమాని చేశారో వారికి సినిమా చేరాలనే ఉద్దేశంతో ఈ గొప్ప నిర్ణయాన్ని నిర్మాతలు తీసుకున్నారు' అని తెలిపారు.
'బుధవారం మహిళలందరూ విచ్చేసి మా సినిమా చూసి, మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని హీరో సుహాస్ చెప్పారు.
నిర్మాత అనురాగ్ మాట్లాడుతూ, 'అబ్బాయిలందరూ వారి మదర్, సిస్టర్ వాళ్ళ సర్కిల్లో ఉన్న అందరికీ ఇది చెప్పి థియేటర్స్‌కి తీసుకురావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం' అని అన్నారు.