Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కన్నడ చలనచిత్ర పరిశ్రమలో సూపర్ హిట్‌గా నిలిచిన శివ రాజ్‌కుమార్ 125వ చిత్రం 'శివ వేద'. ఈ చిత్రాన్ని ఆయన భార్య గీతా శివ రాజ్‌కుమార్ తమ సొంత సంస్థ గీతా పిక్చర్స్‌పై దీన్ని మొదటి ప్రాజెక్ట్‌గా నిర్మించారు.
ఈ సినిమాను కంచి కామాక్షి కలకత్తా క్రియేషన్స్ ద్వారా తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో నేడు (గురువారం) గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరో బాలకృష్ణ మాట్లాడుతూ, 'ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. కన్నడలో మాదిరిగానే తెలుగులో వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్లో బిగ్ హిట్ అవ్వాలి' అని తెలిపారు. 'నా భార్య గీతా శివరాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమాలో వినోదంతో పాటు మంచి మెసేజ్ ఉంది. చూసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఫీల్ అవుతారు' అని హీరో శివ రాజ్ కుమార్ చెప్పారు. 'ఈ సినిమా ఎమోషనల్ డ్రామా, యాక్షన్ థ్రిల్లర్‌గా కూడా ఉంటుంది' చిత్ర దర్శకుడు హర్ష చెప్పారు. తెలుగు ప్రేక్షకులు అందరూ మా చిత్రాన్ని ఆదరించి పెద్ద హిట్ చేస్తారనే నమ్మకంతో ఉన్నాం అని నిర్మాత ఎం.వి. ఆర్.కృష్ణ తెలిపారు.