Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''బ్రహ్మవరం' పి.ఎస్.పరిధిలో.. ఏం జరిగింది? అనేదే ఈ సినిమా కథ. దీనికి మేం 'సమ్ టైమ్స్ మిస్టేక్స్ బ్రింగ్ జస్టిస్' అంటే కొన్నిసార్లు మనం చేసే తప్పులు కూడా.. కొంత జస్టిస్‌ను తీసుకొస్తాయి అనే థీమ్ లైన్‌ని కూడా ఇచ్చాం.
తప్పులు జస్టిస్‌ను తీసుకు రావడం ఏమిటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందేనని అంటున్నారు దర్శకులు ఇమ్రాన్ శాస్రి. సమ్మెట గాంధీ, ప్రేమ్ సాగర్, రూపా లక్ష్మి, బెల్లం కొండ స్రవంతి, హర్షిని,గురు చరణ్, సూర్య నటీ నటులుగా ఇమ్రాన్ శాస్రిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డ్రీమ్జ్ ఆన్ రీల్జ్ నిర్మిస్తున్న చిత్రమిది. ఈ సినిమా విజయవంతంగా షూటింగ్ పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించి, చిత్ర ఫస్ట్‌లుక్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా ప్రేమ్ సాగర్ మాట్లాడుతూ,'మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్ ఉన్న ఈ సినిమాను చిన్న సినిమా అని చూడకుండా సమాజానికి పనికివచ్చే ఒక మంచి కంటెంట్‌తోపాటు మెసేజ్ ఉన్న ఇలాంటి సినిమాలు చూడండి' అని తెలిపారు. 'ఇది నా మొదటి సినిమా. అన్ని వర్గాల వారికి నచ్చే విధంగా ఇందులో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అందరూ ఎంజారు చేసేలా ఇందులో చక్కటి సస్పెన్స్‌తో పాటు సినిమా మొత్తం చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది' అని హీరోయిన్ బెల్లం కొండ స్రవంతి చెప్పారు. చిత్ర దర్శకుడు ఇమ్రాన్ శాస్త్రి మాట్లాడుతూ,' ఈ సినిమాకి రచన, దర్శకత్వం వహించాను. ఇప్పుడు వచ్చే సస్పెన్స్ థ్రిల్లర్ కథలకి భిన్నంగా మేం ఫ్యామిలీ డ్రామాతో పాటు సస్పెన్స్‌ను జోడించి ఈ సినిమా తీశాం' అని తెలిపారు.
నటుడు గురు మాట్లాడుతూ, 'ప్రొడక్షన్ పరంగా నిర్మాతలు అమెరికాలో ఉన్నా కూడా సినిమాకు ఏమి కావాలంటే అది ఖర్చుకు వెనుకడకుండా నిర్మించారు. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చేవిధంగా దర్శకుడు చాలా డిఫరెంట్‌గా తీశాడు' అని చెప్పారు.'డిఫరెంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా వుంది. కంటెంట్‌ని నమ్ముకుని చేసిన ఈ సినిమాలో ఉన్న పాటలు అన్నీ అందరికీ నచ్చుతాయి' అని సంగీత దర్శకుడు సాకేత్ సాయిరామ్ అని అన్నారు.