Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బింబిసార' ఘన విజయం తర్వాత ఓ నటుడిగానే కాకుండా నిర్మాతగానూ నాపై మరింత బాధ్యత పెరిగింది. కథల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి రావడంతో ఇప్పటి వరకు ఒక్క స్క్రిప్ట్‌ని కూడా ఫైనల్ చేయలేదు' అని హీరో కళ్యాణ్‌రామ్ అన్నారు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'అమిగోస్'. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేసిన ఈ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో హీరో కళ్యాణ్‌రామ్ బుధవారం మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
అందుకే గ్రీన్‌సిగల్ ఇచ్చా..
'బింబిసార, అమిగోస్, డెవిల్ చిత్రాలను 2020లో ఫైనల్ చేశాను. వీటిల్లో 'బింబిసార' ఎంతటి ఘనవిజయాన్ని సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సక్సెస్‌తో నాపై మరింత బాధ్యత పెరిగింది. మైత్రి మూవీ మేకర్స్ అథినేతలు 'అమిగోస్' కథ వినమని చెప్పారు. నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి చెప్పిన ఈ చిత్రకథలో నావెల్టీ ఉంది. ముఖ్యంగా డాపర్గ్యాంగర్స్ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. అచ్చ తెలుగులో చెప్పాలంటే ఒకేలాగ ఉండే ముగ్గురు వ్యక్తుల కథ ఇది. ఇది నాకు ఫ్రెష్ అంటెప్ట్ అనిపించింది. అందుకే గ్రీన్‌సిగల్ ఇచ్చా.
నమ్మశక్యం కాని కాన్సెప్ట్ కాదు
డాపర్గ్యాంగర్స్ కాన్సెప్ట్ అనేది నమ్మశక్యం కాని కాన్సెప్ట్ కాదు. ఇటీవల ట్విట్టర్‌ని కొనుగోలు చేసిన ఎలాన్‌మస్క్ మాదిరిగానే ఇంకొకరు ఉన్నారని వార్తలు వినిపించాయి. ఇలాంటిదే రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలోనూ వినిపించాయి. అయితే ఇది ప్రయోగాత్మక చిత్రం కాదు. దీనికి ముందు నేను చేసిన '118' సినిమా మాత్రం ప్రయోగాత్మక చిత్రమే. అయినప్పటికీ నా సినిమాలన్ని కమర్షియల్‌గా ఉంటాయి.అలాగే ఓ సినిమాలో నేను నటించేటప్పుడు కథలో, నా పాత్రలో ఫ్రెష్‌నెస్ ఉందా లేదా అని చూస్తాను. అలా సెలెక్టీవ్‌గా 'బింబిసార' చేశా. ఈ కథలో ఉన్న టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌తోపాటు ఫాంటసీ ఎలిమెంట్స్ బాగా అలరించాయి.
ఇలాంటి సినిమాలు చేయటం చాలా కష్టం
ఇందులో మంజునాథ్, సిద్ధార్థ్, మైఖేల్‌గా మూడు భిన్న పాత్రలను పోషించా. త్రిపాత్రాభినయం చేస్తున్నప్పుడు సాంకేతికంగా చాలా కష్టతరంగా ఉంటుంది. ఎందుకంటే మూడు పాత్రలు మూడు స్వభావాలతోపాటు, మూడు భిన్న గెటప్స్‌తో ఉంటాయి. వాటిని మేనేజ్ చేసుకుంటూ చిత్రీకరణ చేయడమంటే కత్తిమీద సామే. కథలోని ఫ్లో మిస్ అవ్వకుండా ఉండాలనే బాలయ్య బాబారు సూపర్‌హిట్ సాంగ్ 'ఎన్నో రాత్రులొస్తాయి..'పాటను పెట్టాం. నాయిక ఆషిక రంగనాథ్ ఎంతో అద్భుతంగా నటించింది. మైత్రి మూవీ మేకర్స్ అభిరుచిగల నిర్మాతలు. వారితో మరిన్ని సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా తప్పకుండా మంచి విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం ఉంది.