Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దాసరి లాంటి పెద్దలు చేసిన మంచి పనులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు పోవాల్సిన కొంతమంది నేటి సినీ పెద్దలు అలాంటి వాటికి తిలోదకాలు ఇచ్చే స్థితికి చేరుకోవడం దారుణమని నిర్మాత నట్టి కుమార్ విమర్శించారు.
గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడుతూ, '7 లక్షల మెడిక్లెయిమ్ పాలసీని కౌన్సిల్లోని ప్రతీ సభ్యుడికీ అందజేయాలి. నిధులు తక్కువగా ఉంటే కనీసం 5 లక్షల పాలసీ అయినా అందరికీ వర్తింపచేయాలి. సినీ పరిశ్రమ నిలబడటానికి దాసరి లాంటి పెద్దలు కారణం. అందుకే ఆయన సినీ జీవిత ప్రయాణాన్ని పలు అంశాలతో నేటి తరానికి అందించాలన్న సంకల్పంతో 'ఇదీ దాసరి చరిత్ర' పేరుతో ఓ సినిమాను తీయాలని నిర్ణయించుకున్నాను. అయితే ఇది బయోగ్రఫీ కాదు. మే 4న దాసరి బర్త్ డే సందర్భంగా ఈ సినిమాను ప్రారంభిస్తాం. ఏపీ ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్ అలీ ఇంతవరకు సినీ పరిశ్రమ వారితో ఎలాంటి మీటింగ్ పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. అలాగే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చిన్న నిర్మాతల కంటే పెద్దవాళ్లతోనే సత్ సంబంధాలు కలిగి ఉంటున్నారు. ఆయన కూడా అందరినీ కలుపుకుపోవాల్సిన అవసరం ఉంది. రాబోయే నిర్మాతల మండలి ఎన్నికల్లో స్వార్థపూరితంగా వ్యవహరించే వ్యక్తులకు ఓట్లు వేయవద్దని కోరుతున్నాను. ఇకనైనా మంచి మార్పు కోసం అందరూ ముందుకు రావాలి' అని తెలిపారు.