Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కళ్యాణ్‌రామ్ త్రిపాత్రాభినయంలో నటించిన చిత్రం 'అమిగోస్'. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి దర్శకత్వంలో నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ నేపథ్యంలో గురువారం చిత్ర బృందం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో కళ్యాణ్‌రామ్ మాట్లాడుతూ, 'సినిమా అవుట్‌ఫుట్ పై అందరం చాలా నమ్మకంతో ఉన్నాం. ఓ మంచి కాన్సెప్ట్‌తోపాటు ఈ సినిమాలో నేను మూడు పాత్రల్లో నటించటం చాలా సంతోషంగా ఉంది. మూడు పాత్రలను చేసే విషయంలో అన్ని రకాల సవాళ్ళను ఎదుర్కొన్నాను. నూతన దర్శకుడు రాజేంద్రరెడ్డి ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. అలాగే మా నిర్మాతలు సినిమా నిర్మాణంలో ఎక్కడా రాజీపడలేదు. నేడు మీ ముందుకు రాబోతున్న ఈ సినిమా తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని తెలిపారు.
'ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం కళ్యాణ్‌రామ్ ఎంతో కష్టపడ్డారు. ఆయనతో నటించటం చాలా గౌరవంగా భావిస్తున్నాను. ఈ సినిమా ఫలితం కోసం అందరం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాం' అని నాయిక అషిక రంగనాథ్ అన్నారు.
నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ మాట్లాడుతూ, 'బింబిసార' వంటి ఘన విజయం సాధించిన తర్వాత కళ్యాణ్‌రామ్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై అందరిలోనూ భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఆ అంచనాలకు మించి ఈ సినిమా ఉంటుందని కచ్చితంగా చెప్పగలం. కళ్యాణ్‌రామ్ కెరీర్లోనే కాకుండా మా బ్యానర్‌లోనూ మరో మంచి సినిమా అవుతుంది' అని చెప్పారు.