Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో నూతన హీరోహీరోయిన్లను పరిచయం చేస్తూ శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కృష్ణగాడు అంటే ఒక రేంజ్'. రాజేష్ దొండపాటి ఈ సినిమాతో డైరెక్టర్‌గా పరిచయం కాబోతున్నారు. రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ హీరో, హీరోయిన్గా నటిస్తున్న ఈచిత్ర ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను డైరెక్టర్ వి.వి.వినాయక్ రిలీజ్ చేసి, మోషన్ పోస్టర్ ఇంట్రెస్టింగ్గా ఉందని చిత్ర బృందాన్ని ప్రశంసించారు.
ఫీల్ గుడ్ లవ్ స్టోరీకి కావాల్సిన సంగీతాన్ని సాబు వర్గీస్ అందించారు. పాటలు, ఆర్ఆర్ కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉండేట్టు కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్‌లోని బీజీఎం కూడా అందరినీ కట్టిపడేసేలా ఉంది. ఎస్ కే రఫి కెమెరాపనితనం ఈ సినిమాకు ప్లస్ అవుతుందని చిత్రయూనిట్ తెలిపింది.
రఘు, స్వాతి పొలిచర్ల, సుజాత, వినరు మహదేవ్ నటిస్తున్న ఈ సినిమాకు డిఒపి : ఎస్ కే రఫి, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: చుంచు భాను ప్రకాష్, హరి హర ప్రసాద్ పెట్లా, ఎడిటర్ : సాయి బాబు తలారి, లిరిక్స్ : వరికుప్పల యాదగిరి.