Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాన్స్ మాస్టర్ బృందా గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'థగ్స్'. తెలుగులో 'కోనసీమ థగ్స్' పేరుతో విడుదల అవుతున్న ఈ చిత్రాన్ని భారీ చిత్రాల నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు హెచ్ ఆర్ పిక్చర్స్ బ్యానర్ పై సమర్పిస్తూ, జీయో స్టూడియోస్‌తో కలిసి నిర్మిస్తున్నారు. తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ హీరోగా పరిచయం అవుతుండగా సింహ, ఆర్ కె సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రంలోని మొదటి వీడియో సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. 'వీర శూర మహంకాళి వస్తోందయ్యా...' అంటూ సాగే ఈ పాట చిత్రంలో కీలక సన్నివేశంలో రానుంది. అమ్మవారు పూనినట్లుగా హీరో హృదు చేసిన నృత్యం ఆకట్టుకుంటోంది. దీనికి శామ్సిఎస్ ఎనర్జిటిక్ ట్యూన్ ఇవ్వగా, వనమాలి చెడును అంతమొందించే క్రోధాన్ని తెలిసేలా లిరిక్స్ అందించారు. కాలభైరవ అద్భుతంగా ఆలపించారు. ప్రీయేష్ గురుస్వామి తన సినిమాటోగ్రఫీతో డివైన్ వైబ్‌ను తీసుకురాగలిగారు. ఈ పాట విడుదలైన కాసేపట్లోనే అద్భుత స్పందనతో ట్రెండింగ్‌లోకి రావడం విశేషం. ఈ చిత్రం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషలలో ఈనెలలోనే భారీ స్థాయిలో విడుదలకు సిద్ధం అవుతోంది.