Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లవ్ సాంగ్స్, పైగా మెలోడీ ట్యూన్స్‌తో ఉంటే ప్రేక్షక లోకానికి ఇట్టే నచ్చేస్తుంటాయి. అలాంటి చక్కటి మెలోడి గీతాలతో, మంచి ప్రేమ కథతో 'ఓ సాథియా' అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాకు దర్శక, నిర్మాతలిద్దరూ మహిళలే కావడం విశేషం. తన్విక జశ్విక క్రియేషన్స్ బ్యానర్‌పై చందన కట్టా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, దివ్యా భావన దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా డైరెక్టర్ క్రిష్ ఈ సినిమాలోని 'వెళ్లిపోయే..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. 'వెళ్లిపోయే.. పాపా వెళ్లిపోయే..' అంటూ సాగిపోయే ఈ బ్రేకప్ సాంగ్‌లో యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. భాస్కరభట్ల రాసిన పదాల కూర్పులో నిజమైన ప్రేమికుడి భావాలు మనసుకు హత్తుకుంటున్నాయి. రాహుల్ సిప్లిగంజ్ ఆలపించిన తీరు, సాంగ్‌కి తగ్గట్టుగా బాబా భాస్కర్ కొరియోగ్రఫీ ఈ పాటలో హైలెట్ అయ్యాయి. వినోద్ కుమార్ (విన్ను) అందించిన మ్యూజిక్ ఈ సాంగ్‌కి మేజర్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ సాంగ్ రిలీజ్ చేసిన దర్శకుడు క్రిష్ ఈ చిత్ర యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ చెప్పారు. సాంగ్ చాలా బాగా వచ్చిందని, ఈ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నానని అన్నారు.
'ఓ సాథియా' అంటూ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో రాబోతున్న ఈ సినిమాలో ఆర్యన్ గౌర, మిష్టి చక్రవర్తి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతంలో రచయిత విజయేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మణిశర్మ విడుదల చేసిన 'ఓ సాథియా' టైటిల్ సాంగ్‌కు సోషల్ మీడియాలో విశేషమైన స్పందన లభించగా, లేటెస్ట్గా డైరెక్టర్ క్రిష్ వదిలిన 'వెళ్లిపోయే' సాంగ్ యూత్ ఆడియన్స్‌కి ఎంతో బాగా కనెక్ట్ అవుతూ యమ స్పీడుగా వ్యూస్ రాబడుతోంది. అతిత్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించనున్నారు.