Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వేద ఎంటర్ప్రైజెస్ పతాకం పై గోదావరి రెస్టారెంట్ దుబారు సహనిర్మాణంలో గౌతమ్ మన్నవ దర్శకత్వ సారథ్యంలో కార్తిక్‌రెడ్డి, వరుణ్ దగ్గుబాటి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'కేసీపీడి' (కొంచెం చూసి ప్రేమించు డూడ్). వాలెంటైన్స్ డే శుభ సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసింది.
ఈ ఫస్ట్‌లుక్‌లో మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేసి, సమ్మర్‌కి విడుదలకి సిద్ధం అవుతుందని వెల్లడించారు. ప్రజెంట్ జనరేషన్లో యువత మనస్తత్వం, వారి ఆలోచనల ధోరణి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ జోనర్లో ఈ సినిమా తెరకెక్కనుందని మేకర్స్ తెలిపారు.
తనీష్ అల్లాడి, శ్రీరామ్ రెడ్డి , ద్వారక విడిఎన్ (బంటి), సుభశ్రీ రాయగురు, ప్రియాంక పాసల, దివ్య దిల్చోకర్ తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి రచన : బంకుపల్లి నాగ భరద్వాజ్, లింగాచారీ, సినిమాటోగ్రఫీ: శ్రీకరబాబు, కథనం : దర్శకత్వం గౌతమ్ మన్నవ.