Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అరవింద్ సమర్పణలో కిరణ్ అబ్బవరం, కాశ్మీర పరదేశి జంటగా నటించిన చిత్రం 'వినరో భాగ్యము విష్ణు కథ'. మురళి కిషోర్ దర్శకత్వంలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై హొబన్నీ వాసు
ఈ చిత్రాన్ని నిర్మించారు. 'భలే భలే మగాడివోరు, గీత గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, 18 పేజెస్' లాంటి అద్భుతమైన చిత్రాల తర్వాత జీఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వస్తున్న సినిమా ఇది. మహా శివరాత్రి కానుకగా ఈనెల 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్స్‌లో హొవిడుదల కాబోతున్న సందర్భంగా కథానాయిక కశ్మీర పరదేశి మీడియాతో ముచ్చటించారు.
'మహారాష్ట్ర రాజ్‌పుత్ వంశానికి చెందిన నేను ఫ్యాషన్ స్టూడెంట్‌ని. నటనపై ఉన్న ఇష్టంతో థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఆ తర్వాత నాకు 2018లో నాగశౌర్య హీరోగా నటించిన 'నర్తనశాల' సినిమాలో నటించే అవకాశం వచ్చింది. ఈ సినిమా తర్వాత డాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా ఇలా అన్ని రకాలుగా నాలో చాలా ఇంప్రూమెంట్ వచ్చింది. 'నర్తనశాల' సినిమా తర్వాత తిరుపతి నేపథ్యంలో ఉన్న ఈ సినిమా కథ వినగానే నాకు నచ్చింది. అంతేకాదు నాకు తిరుపతితో ఎక్కువ ఎటాచ్మెంట్ ఉంది. ఈ సినిమా చేయడం వలన అవకాశాలపరంగా నాకు పాజిటివ్ వైబ్రేషన్స్ రావడం ఒక ఎత్తయితే, గీతాఆర్ట్స్‌లో సినిమా చేసే అవకాశం రావడం మరో ఎత్తు. ఈ బ్యానర్లో చేయడం నాకు చాలా కంఫర్టబుల్‌గా ఉంది. వాళ్ళు నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఈ సినిమాలో నేను దర్శన పాత్రలో మంచి స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. నెంబర్ నైబరింగ్ కాన్సెప్ట్‌తో వస్తున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులందరినీ కచ్చితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. అలాగే ఈ సినిమా కోసం షూటింగ్ మధ్యలో, షూటింగ్ తర్వాత కూడా సినిమా ప్రమోషన్లో భాగంగా మురళీ శర్మ లాంటి సీనియర్ యాక్టర్‌తో రీల్స్ చేయటం చాలా సంతోషంగా అనిపించింది.
నేను మరాఠి అయినా నాకు తెలుగు సినిమాలు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తెలుగు సినిమాలు మంచి కంటెంట్‌తో పాటు కమర్షియల్ యాంగిల్లో ప్రేక్షకులందరినీ అలరిస్తాయి. ఇలా చేయడం చాలా రిస్క్ అయినా ఛాలెంజింగ్‌గా తీసుకుని చాలా చక్కగా తెరకెక్కిస్తారు. అయితే మరాఠీ సినిమాలు ఇందుకు భిన్నంగా ఉంటాయి. అక్కడ సినిమాలు కమర్షియల్‌గా కాకుండా ఎక్కువ రియలిస్టిక్ని బేస్ చేసుకొని సినిమాలు తీస్తారు. ఈ సినిమా తర్వాత తెలుగులో ఒక సినిమా కోసం కథాచర్చలు నడుస్తున్నాయి. అలాగే తమిళంలో ఓ సినిమా, హిందీలో ఓ సినిమా చేస్తున్నాను' అని కశ్మీర అన్నారు.