Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గుత్తాధిపత్యం వల్ల చిత్ర పరిశ్రమ నాశనం అవుతోంది. నేడు (ఆదివారం) జరగబోయే నిర్మాత మండలి ఎన్నికల్లో సభ్యులందరూ అవగాహనతో ఓటు వేయండి' అని నిర్మాతల మండలి అధ్యక్షుడు సి.కళ్యాణ్ చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, '2019 నుంచి 2023 ఫిబ్రవరి వరకు కౌన్సిల్ ప్రెసిడెంట్‌గా రెండవ సారి ఎన్నికయ్యాను. కళ్యాణ్ లీడ్ చేస్తే మంచే జరుగుతుంది అనే నమ్మకం మీకు కలిగితే మీరందరూ మా ప్యానల్‌కు ఓటెయ్యండి. ఈ ఆర్గనైజేషన్‌ను కాపాడండి. ఇందులో ఉన్న 1200 మంది సభ్యుల ఆవేదన నాకు తెలుసు. ఇక్కడంత మోనో పలి అయ్యింది. వారే హీరోలు, వారే డిస్ట్రిబ్యూటర్స్, వారివే థియేటర్స్ ఇలా వారు ఇండిస్టీని శాసిస్తున్నారు. చిన్న సినిమాలను బతికించాలి. లేకపోతే పరిశ్రమ లేదు' అని తెలిపారు.