Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో నరేష్ అగస్త్య హీరోగా డెక్కన్ డ్రీమ్ వర్క్స్ బ్యానర్ పై నబిషేక్, తూము నర్సింహా పటేల్ నిర్మిస్తున్న చిత్రం 'దిల్ వాలా'. క్రైమ్ కామెడీ జోనర్లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం వైజాగ్‌లో ఏకధాటిగా 20 రోజుల పాటు చేసిన చిత్రీకరణతో టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. వైజాగ్ షెడ్యుల్‌లో నరేష్ అగస్త్య, రాజేంద్రప్రసాద్, హీరోయిన్ శ్వేత అవస్తి, సెకండ్ హీరోయిన్ ప్రగ్యా నైనా, అలీ రెజా పై కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటని చిత్రీకరించారు. దీంతో 95 శాతం చిత్రీకరణ పూర్తయింది. మరో రెండు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. ఈ రెండు పాటలను బ్యాంకాక్‌లో చిత్రీకరించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మార్చిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పూర్తి చేసుకొని, ఏప్రిల్‌లో సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్ చౌదరి మాట్లాడుతూ,'నిర్మాతలు ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రం కోసం ఖర్చు చేశారు. వైజాగ్‌లో రుషికొండ, తొట్లకొండ బీచ్, యారాడ బీచ్ , అరకు లాంటి అందమైన లోకేషన్స్‌లో చిత్రీకరించాం' అని అన్నారు.