Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన సినిమా 'బేబీ'.
సాయి రాజేశ్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని ఎస్.కే.ఎన్ నిర్మించారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా' తొలి లిరికల్ సాంగ్‌కు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప స్పందన వచ్చింది.
ఈ నేపథ్యంలో ఈ పాటకి మించి ఉండాలనే లక్ష్యంతో ఈ చిత్రంలోని రెండో పాటను ప్రముఖ మలయాళ సింగర్ ఆర్య దయాల్‌తో పాడించింది చిత్ర బృందం. అంతేకాదు.. ఓ పెద్ద బడ్జెట్ సినిమా పాటలాగా ఆర్య దయాల్ పాడుతుండగా ఈ గీతాన్ని వీడియోగానూ చేశారు. ఆ లిరికల్ వీడియో పూర్తయిన సందర్భంగా దర్శకుడు సాయి రాజేశ్ మాట్లాడుతూ,'మా ఫస్ట్ సాంగ్ ఓ పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకూ అన్ని డిజిటల్ ప్లాట్ ఫామ్స్‌లో 20 మిలియన్ వ్యూస్ సంపాదించుకుంది. ఆర్య దయాల్‌తో పాడించిన రెండవ పాట ఫస్ట్ సాంగ్‌కు మించి పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నాం. ఈ పాట తర్వాత తెలుగు ప్రజలు ఆర్యదయాల్ వాయిస్‌తో ప్రేమలో పడతారు అని ఖచ్చితంగా చెప్పగలను' అని అన్నారు. ''బేబీ' మూవీ మ్యూజిక్ హిట్ అవుతుందని నమ్ముతున్నాం. సినిమాలో రెండవ పాట వస్తున్నప్పుడు ఓ హై మూమెంట్ వస్తుంది. ఎక్స్పీరియన్డ్స్ డైరెక్టర్లా సాయి రాజేశ్ ఈ సినిమాను చాలా అద్భుతంగా తెరకెక్కించాడు' అని నిర్మాత ఎస్కేఎన్ చెప్పారు. సింగర్ ఆర్య దయాల్ మాట్లాడుతూ, 'తెలుగు పాట కోసం ఇంత మంచి భాష నేర్చుకోవడం సంతోషంగా అనిపించింది. రికార్డింగ్ అంతా చాలా ఫన్నీగా జరిగింది. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌లో భాగమైనందుకు గర్వంగా ఉంది' అని చెప్పారు.