Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైటర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ కార్యాల యాన్ని ప్రారంభించడంతో పాటు అందులో సభ్యత్వం తీసుకున్నారు నిర్మాత, రచయిత, నటుడు నాగబాబు.
తెలుగు టెలివిజన్ కోసం గతంలోనూ ప్రస్తుతం రాస్తున్న రచయితలందరూ వారి సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్నదే రైటర్స్ అసోసి యేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్ (వాట్). సినీ, టీవీ రచయిత
డా. సాయిమాధవ్ బుర్రా హైదరాబాద్ పుప్పాలగూడలోని తన ఆఫీస్‌ను ఈ కార్యాలయానికి ఉచితంగా ఇవ్వడం విశేషం.
శుక్రవారం దీన్ని ప్రారంభించిన సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, 'సభ్యుల ఆరోగ్యభీమా పథకం అమలుకి అండగా ఉంటాను' అని తెలిపారు. ప్రభుత్వ పెద్దలను కలుస్తామని అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జి.శశాంక, అధ్యక్షులు కొమ్మనాపల్లి గణపతి తెలుపగా, సీనియర్ రచయితల సభ్యత్వం, వృద్ధ రచయితలకు అండగా ఉండటం, అలాగే టీవీలకు రాస్తున్న అందరినీ ఏకతాటిపైకి తెచ్చి సమస్యలకు కార్యాచరణ చేస్తామని ఫౌండర్ ప్రెసిడెంట్ ఉషారాణి, అడ్వైజర్ రవికొలికపూడి, కార్యవర్గం సభ్యులు అంజన్, ప్రభు, వెంకటేష్‌బాబు, మహేంద్రవర్మ, ఫణికుమార్, రామారావు తెలిపారు.