Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఈ మధ్య కాలంలో మనకు బాగా వినిపిస్తున్న పదం ట్రెండింగ్. నిత్య జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ ట్రెండ్ చేయాలని తపన పడే మనస్తత్వం మనలో చాలా మందికి ఉంటుంది. దీనిమీద సెటైరికల్‌గా చేసినటువంటి పాటే ''ట్రెండింగో''. ఈ పాటకు సంగీతం, లిరిక్స్, కాన్సెప్ట్ అందించడమే కాకుండా రఘుకుంచె పాడి, నటించటం కూడా విశేషం. ఈ పాటను కె.వి.కె. దర్శకత్వం వహించారు. శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ పతకాంపై టి.విజయలక్ష్మి నిర్మించిన ఈ పాటను ప్రసాద్ ల్యాబ్‌లో ఘనంగా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరోయిన్ లయ, సంగీత దర్శకుడు ఆర్.పి.పట్నాయక్, లిరిసిస్ట్ చంద్రబోస్, దర్శకులు అనిల్ కన్నెగంటి, కరుణ కుమార్, రైటర్ లక్ష్మీ భూపాల్ ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ, 'ఈ పాటలో ఎక్కువగా ఫన్ ఎలిమెంట్ ఉంటుంది. ఈ పాటని శ్రీ నందన్ ఇన్ఫ్రా డెవలప్మెంట్ టి.విజయలక్ష్మి ప్రొడ్యూస్ చేశారు. మేము చేసిన ఈ పాటకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. హీరోయిన్ లయ మాట్లాడుతూ, 'సినిమాలు మానేసిన చాలా ఏళ్ల తరువాత ఈ సాంగ్ లాంచ్‌కు రావడం చాలా సంతోషంగా ఉంది' అని అన్నారు. నిర్మాత టి.విజయలక్ష్మి మాట్లాడుతూ,'చూసిన ప్రతి ఒక్కరూ సాంగ్ బాగుందని చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది' అని చెప్పారు.