Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గోపీచంద్ తన 31వ చిత్రాన్ని కన్నడ దర్శకుడు ఎ.హర్షతో చేయబోతున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.14గా నిర్మాత కెకె రాధామోహన్ నిర్మించనున్నారు. ఈ భిన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ పూజా కార్యక్రమం శుక్రవారం చిత్ర యూనిట్ సమక్షంలో లాంఛనంగా జరిగింది.ఈ సందర్భంగా నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ, 'మా ప్రొడక్షన్ నెం.14 కోసం హీరో గోపీచంద్, దర్శకుడు హర్షతో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. ఈ నెలలోనే సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది' అని అన్నారు. కన్నడలో పలు బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించిన హర్ష ఈ చిత్రం ద్వారా టాలీవుడ్లోకి అడుగుపెడుతున్నారు. మంచి ఫ్యామిలీ ఎమోషన్స్‌తో మాసీవ్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాకి సంబంధించి మిగిలిన వివరాలను మేకర్స్ త్వరలోనే ప్రకటించనున్నారు.