Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వివివి ప్రొడక్షన్స్ పతాకంపై ఎం.ఏ.చౌదరి దర్శకత్వంలో కె. కోటేశ్వరరావు నిర్మించిన చిత్రం 'వీరఖడ్గం'. మారుశెట్టి సునీల్ కుమార్ లైన్ ప్రొడ్యూసర్. సృష్టి డాంగే హీరోయిన్. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల మూడో వారంలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ,'పగ కూడా ఒక మనిషిని నాశనం చెయ్యాలి అనుకుంటే ఎన్ని జన్మలైనా సరే, దాన్ని సాధించే వరకు మనిషి జీవితం మసి అయినా, ఆ శవమే మృగమై వెంటాడుతుంది. వాస్తవాన్ని వెంటాడుతూ గతం చేసిన యుద్ధమే ఈ సినిమా. గ్రాఫిక్స్‌కి ప్రాధాన్యత ఉన్న చిత్రమిది' అని తెలిపారు. 'సినిమా చాలా బాగా వచ్చింది. ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా' అని లైన్ ప్రొడ్యూసర్ మారుశెట్టి సునీల్ కుమార్ అన్నారు. నిర్మాత డా.ప్రతాని రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ, 'సినిమా చూశాను. మంచి గ్రాఫిక్స్‌తో చాలా గ్రాండ్‌గా తీశారు. పాటలు కూడా బావున్నాయి. లొకేషన్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ఈ సినిమా పెద్ద సక్సెస్ సాధిస్తుంది' అని తెలిపారు.