Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా బివి నందిని రెడ్డి దర్శకత్వంలో స్వప్న సినిమా పతాకంపై రూపొందుతున్న చిత్రం 'అన్నీ మంచి శకునములే'. లేటెస్ట్గా 'సీతారామం' స్టార్ దుల్కర్ సల్మాన్ ఈ చిత్ర టీజర్‌ని లాంచ్ చేశారు.
రెండు విభిన్నమైన, ప్లజంట్ కుటుంబాలను, వారి మధ్య అందమైన బంధాన్ని టీజర్ పరిచయం చేస్తుంది. ఈ 76-సెకన్ల వీడియోలో భావోద్వేగాలతో కూడిన రోలర్‌కోస్టర్ రైడ్‌లా ఉంది. హిల్ ఏరియా నేపథ్యంలో సాగే కథ, విజువల్స్ బ్యూటీఫుల్‌గా ఉన్నాయి. సంతోష్ శోభన్, మాళవిక నాయర్ మెయిన్ లీడ్ చాలా బాగుంది. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి, షావుకారు జానకి ప్రజన్స్ కంప్లీట్ నెస్ ని తీసుకొచ్చింది ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లు చేయడంలో పేరుపొందిన నందిని రెడ్డి అందమైన భావోద్వేగాలతో కూడిన మరో బ్రీజీ రొమాంటిక్ ఎంటర్టైనర్తో ముందుకు వచ్చారు. మిత్ర విందా మూవీస్‌తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సమ్మర్లో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్స్‌లో ఒకటిగా మే 18న సినిమాను విడుదల చేస్తామని టీజర్ ద్వారా మేకర్స్ అనౌన్స్ చేశారు.