Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - దుబ్బాక రూరల్
సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పోతారం గ్రామంలో సోమవారం శ్రీ మేడాలమ్మ కేతమ్మ సమేత శ్రీ మల్లికార్జునస్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావ్ ముఖ్య అతిథిగా హాజరై స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వారిని మల్లికార్జున సంఘం సభ్యులు శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వామి వారి దయతో నియోజకవర్గ ప్రజలు బాగుండాలని అన్నారు. తదనంతరం డోల్ దెబ్బ ఉమ్మడి జిల్లా సంఘం ఉపాధ్యక్షుడు సల్కం మల్లేశం మాట్లాడుతూ ప్రతి ఏడూ ఈ ఉత్సవం నిర్వహిస్తామని, గత మూడు రోజుల నుండి ఆలయ ప్రాంగణంలో హోమం, అగ్ని గుండాలు, విశిష్ట పూజలతో పాటు అన్న దాన కార్యక్రమాలు జరిగాయన్నారు. ఈ ఉత్సవానికి ఇతర జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున వచ్చారని తెలిపారు. తన స్వంత ఖర్చులతో 2000 మంది భక్తులకు అన్నదానం సౌకర్యం కల్పించినట్లు పేర్కొన్నారు. స్వామి వారి కరుణ కటాక్షంతో అన్నదానం చేపట్టడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో మల్లికార్జున యాదవ సంఘం సభ్యులు ఉన్నారు.