Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ గాయపడ్డారు.
'ప్రాజెక్ట్ కె' షూటింగ్లో ఆయనకు ఈ ప్రమాదం జరిగింది. ప్రభాస్, దీపికా పదుకొనె జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ వరల్డ్ సినిమా 'ప్రాజెక్ట్ కె'. ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్లో ఏకధాటిగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అమితాబ్ పాల్గొనగా కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సమయంలో ఆయనకు గాయాలయ్యాయి. ఇదే విషయాన్ని ఆయన తన బ్లాగ్లో పేర్కొంటూ, 'ప్రాజెక్ట్ కె కోసం యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నప్పుడు కుడివైపు పక్కటెముకలకు దెబ్బ తగిలింది. షూట్ రద్దు చేసుకుని హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో తగిన చికిత్స తీసుకున్నాను. ఊపిరి తీసుకుంటున్నప్పుడు ఇబ్బందిగా ఉండటంతో వైద్యులు కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోమన్నారు. వారి సలహా మేరకు ముంబయిలోని నా జల్సా నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాను' అని అమితాబ్ అన్నారు.