Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తన తండ్రి తనని లైంగిక వేధింపులకు గురి చేశాడని సీనియర్ కథానాయిక ఖుష్బూ సంచలన వ్యాఖ్య్లలు చేశారు. 8 ఏండ్ల వయసులోనే తాను వేధింపులకు గురైనట్లు ఆమె తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఓ కార్యక్రమంలో పాల్గొన్న నటి, జాతీయ మహిళా అధ్యక్షురాలు ఖుష్బూ మాట్లాడుతూ, 'నాకు 8 ఏండ్ల వయసు ఉన్నప్పుడు నా తండ్రి నన్ను లైంగికంగా వేధించాడు. నన్ను గాయ పరిచి, చిత్ర హింసలకు గురి చేశాడు' అని కన్నీటి పర్యంత మయ్యారు. 'ఒక అబ్బాయి లేదా అమ్మాయి చిన్నతనంలోనే వేధింపులకు గురైతే, అది వాళ్ళను జీవితాంతం భయానికి గురి చేస్తుంది. తన భార్యాపిల్లల్ని చిత్ర హింసలు పెట్టడం, కన్న కూతురిపై లైంగిక వేధింపులకు పాల్పడటాన్ని జన్మహక్కుగా భావించే వ్యక్తి వల్ల నా తల్లి కూడా వైవాహిక బంధంలో ఇబ్బందులు పడింది. దీంతో 15 ఏండ్ల వయసులోనే ఆయనకి ఎదురు తిరగడం మొదలు పెట్టాను' అని చెప్పారు.