Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో భారీ చిత్రాలను నిర్మించిన తెలుగు నిర్మాత మధు మంతెన తండ్రి, డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ మేనమామ నిర్మాత మురళీ రాజు (70) కన్ను మూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ మధురానగర్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. భీమవరానికి చెందిన మురళీ రాజు నిర్మాతగా పలు చిత్రాలను నిర్మించారు. అలాగే సినీ నిర్మాణమే కాకుండా పలు వ్యాపారాలను కూడా ఆయన కొనసాగించారు. మురళీ రాజుకు ఇద్దరు సంతానం. అందులో ఒకరు నిర్మాత మధు మంతెన కాగా, కూతురు అంబిక.నిర్మాత మధు మంతెన తెలుగులో 'గజని', 'రక్త చరిత్ర 1, 2' చిత్రాలతోపాటు బాలీవుడ్, ఇతర భాషలలో సుమారు 34కు పైగా చిత్రాలను నిర్మించారు. నిర్మాత అల్లు అరవింద్, హీరో అల్లు అర్జున్, డైరెక్టర్ క్రిష్, నిర్మాత బన్నీ వాసు తదితరులతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ తదితరులు మురళీ రాజు భౌతిక కాయాన్ని సందర్శించి, నివాళి అర్పించారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.