Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిజ ఘటనలు ఆధారంగా రూపొందిన ఇన్టెన్స్ ఎమోషనల్ డ్రామా 'గీత సాక్షిగా'. ఆదర్శ్, చిత్రా శుక్లా జంటగా నటించారు. హోలీ సందర్భంగా సోమవారం రోజు మేకర్స్ ప్రేక్షకులందరికీ హోలీ శుభాకాంక్షలను తెలియజేస్తూ ఈ సినిమాను ఈనెల 22న తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. పోస్టర్లో 'గీత సాక్షిగా జడ్జ్మెంట్ డే మార్చి 22న' అని తెలియజేశారు. 'మా చిత్రం తెలుగుతో పాటు హిందీలోనూ రిలీజ్ అవుతుంది. మంచి సినిమాలను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని 'గీత సాక్షిగా' మరోసారి ప్రూవ్ చేస్తుందనే నమ్మకం ఉంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ను అందించబోతున్నాం. సినిమాలో చరిష్మా కీ రోల్ పోషించింది. ఆమె చుట్టూనే సినిమా కథాంశం తిరుగుతుంటుంది' అని మేకర్స్ తెలిపారు. శ్రీకాంత్ అయ్యంగార్, రూపేష్ శెట్టి, చరిష్మా, భరణి శంకర్, జయలలిత, అనితా చౌదరి, రాజా రవీంద్ర తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. 'గీత సాక్షిగా' చిత్రాన్ని ఆంథోని మట్టిపల్లి స్క్రీన్‌ప్లే రాసుకుని, చక్కగా తెరకెక్కించారు. చేతన్ రాజ్ ఫిలింస్ బ్యానర్‌పై చేతన్ రాజ్ ఈ సినిమాను నిర్మించటమే కాకుండా స్టోరీ కూడా రాశారు.