Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆనంద్ దేవరకొండ హీరోగా 'పుష్పక విమానం' సినిమాని రూపొందించి అందర్నీ ఆకట్టుకున్నారు దర్శకుడు దామోదర. తాజాగా ఆయన విలేజ్ బ్యాక్డ్రాప్లో సాగే రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఆయన స్వీయదర్శకత్వంలో ర్యాడికల్ పిక్చర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి 'కన్యాకుమారి' అనే టైటిల్ను ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ పోస్టర్ని విడుదల చేశారు. 'పుష్పక విమానం'లో ఓ హీరోయిన్గా నటించిన గీతా శైనీ, శ్రీ చరణ్ రాచకొండ జంటగా ఇందులో నటిస్తున్నారు. ఈ కథను శ్రీకాకుళం నేపథ్యంలో సాగే గ్రామీణ ప్రేమకథా చిత్రంగా దామోదర రూపొందిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది. త్వరలోనే దీన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎడిటర్: నరేష్ అడుపా, సంగీతం: సాహిత్య సాగర్, సినిమాటోగ్రఫీ : శివ గాజుల, సహ నిర్మాతలు : సతీష్ రెడ్డి, వరీనియా మామిడి, సిద్ధార్థ్ ఏ, నిర్మాత, మాటలు, దర్శకత్వం : దామోదర.