Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, శ్రీనివాస్ అవసరాల కలయికలో వస్తున్న మూడవ చిత్రం 'ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని టీజీ విశ్వ ప్రసాద్, పద్మజ దాసరి నిర్మించారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మాళవిక నాయర్ హీరోయిన్. ఈనెల 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో ఈ చిత్రం నుంచి వివేక్ సాగర్ సంగీతం సమకూర్చిన 'కఫీఫీ' పాట విడుదలైంది. ఇప్పటిదాకా కళ్యాణిమాలిక్ స్వరపర్చిన పాటలు విడుదలై హాయిగా సాగే మెలోడీలు అయితే.. ఈ పెప్పీ నెంబర్ మాత్రం అందరిలో ఉత్సాహాన్ని నింపేలా ఉంది. 'నలుగురిలో ఉంటే.. చనువుకి నో నో చెప్పేదే కఫీఫీ'' అంటూ పాట సందర్భానికి తగ్గట్లుగా కిట్టు విస్సాప్రగడ అందించిన సాహిత్యం అందంగా, అర్థవంతంగా ఉంది.