Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బిచ్చగాడు' మూవీతో తెలుగులో మంచి స్టార్‌డమ్ తెచ్చుకున్న విజరు ఆంటోనీ దీనికి సీక్వెల్‌గా 'బిచ్చగాడు 2'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని తనే నిర్మిస్తూ, డైరెక్ట్ చేయటం విశేషం. అలాగే సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా ఆయనే నిర్వర్తించడం మరో విశేషం.
'బిచ్చగాడు2' అనే టైటిల్‌తో పాటు 'బికిలి' అనే టైటిల్ కూడా పెట్టారు విజరు ఆంటోనీ. అయితే ఈ 'బికిలి' అనే పదానికి అర్థం ఏంటీ అంటూ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. వారి కన్ఫ్యూజన్‌ను క్లియర్ చేస్తూ.. బికిలీ అనే పదానికి అర్థం చెబుతూ.. లేటెస్ట్‌గా ఈ మూవీ నుంచి లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు.
'పేదవాళ్ల పేదరికాన్ని ఉపయోగించుకుని తన దగ్గరున్న ధనబలంతో వాళ్ల పొట్టను కొట్టి, వాళ్లను బానిసలుగా మార్చి డబ్బుందన్న అహంకారంతో తిరిగేవాడే బికిలీ. వాళ్లను మనం ఏం చేయలేకపోయినా.. బికిలీ అనే పదంతో పిలవొచ్చు. ఈ రోజు నుంచి నేను కనిపెట్టిన ఈ బికిలీ పదం.. భారతదేశంలో వాడకంలోకి వస్తుంది..' అంటూ విజరు ఆంటోనీ చెప్పిన మాటలతో మొదలైన వీడియో సాంగ్.. అర్థవంతమైన సాహిత్యంతో సాగింది. ఈ గీతాన్ని కంపోజ్ చేసి, పాడటమే కాదు.. రాసింది కూడా విజరు ఆంటోనీయే కావడం విశేషం. ఈ సమ్మర్ స్పెషల్‌గా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.