Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'రంగ మార్తాండ'. ఇళయరాజా సంగీత సారథ్యంలో ఈ సినిమా ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర లిరికల్స్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకున్నాయి. మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా 'నట్ సామ్రాట్'కి అధికారిక తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 22న ఉగాది స్పెషల్‌గా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానుంది.
దర్శకుడు కృష్ణవంశీ ఒక తపస్సులా పూర్తి చేసిన ఈ చిత్రం రంగస్థల కళాకారుల జీవితాల చుట్టూ అల్లిన కథతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చూస్తున్నంతసేపూ ప్రేక్షకులు తమ లోకాన్ని మరచిపోతారు. రాహుల్ సిప్లిగంజ్, శివాని రాజశేఖర్, ఆదర్శ్ బాలకృష్ణ, అలీ రెజ, అనసూయ తదితరులు కీలక పాత్రల్లో మెరవబోతున్నారు.
ఇప్పటికే ఈచిత్రాన్ని చిత్ర పరిశ్రమకి చెందిన పలువురు ప్రముఖులతోపాటు ముఖ్యంగా మహిళా నటీమణులకు ప్రత్యేకంగా ప్రీమియర్స్ వేశారు. చూసిన ప్రతి ఒక్కరూ ఈ సినిమా కృష్ణవంశీ కమ్ బ్యాక్ ఫిల్మ్ అని, భావోద్వేగాల సమాహారంగా తీర్చిదిద్దిన ఈ చిత్రంతో మరోమారు కృష్ణవంశీ దర్శక విశ్వరూపాన్ని చూశామని చేసిన ప్రశంసలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సినిమా రిలీజ్‌కి ముందే ప్రీమియర్లతో ప్రముఖుల అభినందనల్ని సొంతం చేసుకున్న ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులతో చప్పట్లు కొట్టించడం ఖాయమంటున్నారు మేకర్స్. అంతేకాదు ప్రతి ఒక్కరూ కన్నీటిపర్యంతమూ అవుతారని చెబుతున్నారు. 'రంగమార్తాండ' సరికొత్త లోకాన్ని చూపించే సినిమా అని, చాలా కాలం తర్వాత కృష్ణవంశీ నుంచి వస్తున్న మరో మంచి సినిమా అని మేకర్స్ దీమా వ్యక్తం చేశారు.