Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హౌస్‌ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్స్ పై కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'రంగ మార్తాండ'. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధానపాత్రలు పోషిస్తున్న ఈ చిత్ర లిరికల్ సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. మరాఠీ సూపర్ హిట్ ఎమోషనల్ డ్రామా 'నట్ సామ్రాట్'కి అధికారిక తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రం
ఉగాది కానుకగా ఈనెల 22న థియేటర్స్‌లో విడుదల కాబోతోంది.
ఈ సందర్భంగా దర్శకుడు కృష్ణవంశీ మాట్లాడుతూ,'సినిమాని చూసిన అందరూ పాజిటీవ్‌గా మాట్లాడుతున్నారు. సినిమా విడుదల తరువాత ప్రేక్షకులకు కూడా సినిమా బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాకు ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ నటన, ఇళయరాజా సంగీతం, సీతారామశాస్త్రి సాహిత్యం ఇలా సినిమాకు అన్ని కుదిరాయి. ఈ సినిమను చూసిన ఒక చిన్నారి ''నేను మా అమ్మా నాన్నలను బాగా చూసుకుంటాను'' అని చెప్పడం విశేషం. ఇలా సినిమా చూసిన అందరూ బాగా ఎమోషనల్ అయ్యారు. ప్రతిఒక్కరూ తమ తల్లి తండ్రులతో ఈ సినిమాను చూడాలని కోరుతున్నాను. ఈ సినిమా చివర్లో రమ్య మీద సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు చాలా బాధపడ్డాను. ఈ పాత్ర కోసం మేకప్, హెయిర్ స్టైల్ కూడా తనే చేసుకుంది. అయితే ఈ సినిమా క్లైమాక్స్‌లో తన మీద సన్నివేశాలు చిత్రీకరించడానికి చచ్చిపోయాను. దాదాపు 36 గంటల పాటు ఈ సీన్స్ తీశాను. అప్పుడు నాకు సెంటిమెంట్ అడ్డొచ్చింది. షూట్ చేస్తుంటే కంట్లో నుంచి నీళ్లు వస్తూనే ఉన్నాయి' అని తెలిపారు. ఇదే వేడుకలో ఆస్కార్ వేదికపై 'నాటు..' పాటను పాడిన గాయకుడు రాహుల్సిప్లిగంజ్ను తెలుగు సినిమా ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఘనంగా సత్కరించింది.