Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సోషల్ మీడియాలో తాను చనిపోయినట్లు వచ్చిన వార్తలను నటుడు కోటా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ఆరోగ్యంగా ఉన్న తనని చంపెయ్యడం ఘోరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మీడియాకి విడుదల చేసిన వీడియోలో ఆయన మాట్లాడుతూ, 'ఉగాది పండుగ ఏర్పాట్లు చూసుకుంటున్న నాకు వరుసగా చాలా ఫోన్ కాల్స్ రావడం ఆందోళన కలిగించింది. అదే కొంచెం పెద్ద వాళ్లైతే గుండె ఆగి చనిపోయే వాళ్ళు. ఈ వార్తల వల్ల నా ఇంటి వద్ద భద్రత కోసం ఏకంగా 10 మంది పోలీసులు వచ్చారు. పాపులారిటీ, డబ్బు కావాలంటే వేరే మార్గాల్లో సంపాదించుకోవచ్చు. ఇలా పుకార్లను వ్యాప్తి చేయడం మంచిది కాదు. మనుషుల జీవితాలతో ఆడుకోవడం దారుణమైన విషయం. ఇలాంటి చర్యలను ప్రజలు తీవ్రంగా ఖండించాలి. ఇప్పుడే కాదు.. ఎప్పుడూ ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని ప్రజలను కోరుతున్నాను' అని ఆవేదన వ్యక్తం చేశారు.