Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిర్మాత అల్లు అరవింద్ ఆశీస్సులతో సత్య ఆర్ట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా 'మెగా పవర్' చిత్రం ఉగాది సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోలో వైభవంగా ప్రారంభమైంది. శ్రీ కల్యాణ్, శశి జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి గేదెల రవిచంద్ర దర్శకుడు. అడబాల నాగబాబు, సాయి నిర్మల, ఇల్లా అభిషేక్, సత్యమూర్తి గేదెల నిర్మాతలు. పూజా కార్యక్రమాల అనంతరం తొలి సన్నివేశానికి రఘుబాబు క్లాప్ ఇచ్చారు. హీరో కిరణ్ అబ్బవరం కెమెరా స్విచ్చాన్ చేశారు. పథ్వీరాజ్ గౌరవ దర్శకత్వం వహించారు. ఇదే వేడుకలో సినిమా టైటిల్‌ను కూడా ఆవిష్కరించారు. హీరో శ్రీ కళ్యాణ్ మాట్లాడుతూ, 'హీరోగా తొలి చిత్రమిది. లైన్ చాలా బావుంది. నా మీద నమ్మకంతో మా బాబారు నిర్మాతగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే నెలలో రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్తాం' అని తెలిపారు. 'తెలుగులో నాకు తొలి చిత్రమిది. హీరోయిన్ పరిచయానికి చక్కని కథ ఇది' అని నాయిక శశి చెప్పారు.దర్శకుడు రవిచంద్ర మాట్లాడుతూ, 'మదర్ సెంటిమెంట్‌తో సాగే యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. త్వరలో ఒక్కో క్యారెక్టర్‌ను రివీల్ చేస్తాం' అని అన్నారు.